Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దాచుకున్న డబ్బంతా ఆ సినిమాతో పోయింది: సింగర్ మనో

  • స్నేహితుల వలన ఆ నిర్ణయం తీసుకున్నాను
  •  పెద్ద మొత్తంలో డబ్బుపోయింది
  •  వయసులో వున్నాను కాబట్టి కోలుకున్నాను
గాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్న 'మనో' కొంతకాలం క్రితం సినిమా నిర్మాణ రంగంలోకి సైతం ప్రవేశించారు. అయితే అక్కడ చేదు అనుభవం ఎదురుకావడంతో, ఆపై అలాంటి ప్రయత్నాలను మానుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో అయన ఆ సంగతులను గురించి ప్రస్తావిస్తూ .. "స్నేహితుల కారణంగా 'తెలుగోడు' అనే సినిమా కోసం కోటి నలభై లక్షల వరకూ పెట్టుబడి పెట్టాను.

అప్పట్లో అది చాలా పెద్ద అమౌంట్ .. ముఖ్యంగా నా స్థాయికి మించిన పెట్టుబడి. అప్పటివరకూ దాచుకున్న డబ్బంతా ఆ సినిమాపై పెట్టేశాను .. నష్టాలు రావడంతో పెట్టిందంతా పోయింది. వయసులో ఉండగా ఆ నష్టం వచ్చింది కనుక తేరుకున్నాను .. వయసైపోయిన తరువాత ఇలాంటి ప్రయోగం చేసుంటే .. ఇక కోలుకునేవాడిని కాదు. అందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను. ఇక అప్పటి నుంచి నిర్మాణం వైపు పోలేదు .. పోను కూడా" అని చెప్పుకొచ్చారు. 
mano

More Telugu News